Latest News

 • మాజీమంత్రి కొల్లు రవీంద్రకు నో బెయిల్: పిటిషన్ తిరస్కరించిన కృష్ణా జిల్లా కోర్టు, రాజమండ్రి జైలులోనే
  on July 30, 2020 at 11:25 am

  మాజీ మంత్రి కొల్లు రవీంద్రకు జిల్లా కోర్టు బెయిల్ తిరస్కరించింది. వైసీపీ నేత మోకా భాస్కర్ రావు హత్య కేసులో కొల్లును పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. గత నెలలో మోకా భాస్కర్ రావు హత్య జరగగా.. రవీంద్ర ప్రమేయంతో హత్య జరిగిందని పోలీసులు చెబుతున్నారు. హత్య

 • ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేసిన ప్రియాంక గాంధీ: బకాయిల చెల్లింపు
  on July 30, 2020 at 11:22 am

  న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ తనకు దేశ రాజధాని న్యూఢిల్లీలోని లూటిన్స్ జోన్‌లో కేంద్ర ప్రభుత్వం కేటాయించిన బంగ్లాను ఖాళీ చేశారు. లోధి ఎస్టేట్‌లోని అకామిడేషన్ 35ను ఖాళీ చేయాలని ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో ఇప్పటి వరకు చెల్లించాల్సిన బకాయిలను ఆమె చెల్లించారు. స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్(ఎస్పీజీ) రక్షణ లేని వ్యక్తులకు ప్రభుత్వ భవనాల్లో ఉండే

 • ఆగష్టు 5న చారిత్రక ఘట్టానికి వేదిక కానున్న టైమ్‌స్క్వేర్..ఏంటో తెలుసా..?
  on July 30, 2020 at 11:19 am

  న్యూయార్క్ : ఆగష్టు 5వ తేదీన అయోధ్యలో రామజన్మభూమిలో రాముడి మందిరంకు శంఖుస్థాపన జరిగనుంది. ఈ చారిత్రక ఘట్టాన్ని అమెరికాలోని ప్రఖ్యాత టైమ్ స్క్వేర్‌లో భూమి పూజ సమయంలో శ్రీరాముడి 3డీ ఫోటోలను భారీ హోర్డింగ్‌లపై ప్రదర్శించనున్నారు. ఈ ఘట్టం చరిత్రలో నిలిచిపోతుందని నిర్వాహకులు చెప్పారు. ఈ కార్యక్రమం కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు అమెరికన్

 • CET exams: పరీక్షలు రాసిన కరోనా పాజిటివ్ విద్యార్థులు, ఫుల్ హ్యాపీ, నో కాంప్రమైజ్, ఆంధ్రా, తెలంగాణ!
  on July 30, 2020 at 11:17 am

  బెంగళూరు/ బళ్లారి: కరోనా వైరస్ (COVID 19) మహమ్మారి తాండవం చేస్తున్న సమయంలో అనేక జాగ్రత్తలు తీసుకుని CET పరీక్షలు నిర్వహిస్తున్నారు. కరోనా వైరస్ వ్యాధిని లెక్క చెయ్యకుండా వేలాది మంది విద్యార్థలు సీఇటీ పరీక్షలకు హాజరయ్యారు. కరోనా వైరస్ పాజిటివ్ వచ్చిన విద్యార్థులు సైతం సీఇటీ పరీక్షలు రాయడానికి ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. కరోనా పాజిటివ్

 • సంచయిత v/s అశోక గజపతిరాజు: సింహాచల ఆలయానికి ప్రసాద్‌పై మాటల యుద్ధం, ట్వీట్ ఫైట్
  on July 30, 2020 at 11:08 am

  మన్సాస్ ట్రస్ట్ చైర్మన్ సంచయిత గజపతిరాజు, మాజీ చైర్మన్, కేంద్రమంత్రి అశోక గజపతిరాజు మధ్య ట్వీట్ పైట్ జరుగుతోంది. వారి మధ్య ఇప్పటికే వైరం ఉండగా.. తాజాగా సింహాచల అప్పన్న ఆలయానికి కేంద్ర ప్రభుత్వ ‘ప్రసాద్'పథకంలో చోటు దక్కడంతో వివాదానికి దారితీసింది. గత ప్రభుత్వ హయాంలో ఏం చేశారని సంచయిత ప్రశ్నించగా.. అశోక గజపతిరాజు కౌంటర్ ఇచ్చారు.

 • జగన్ సర్కారు పెన్షన్ల పెంపు ఎప్పుడో - రెండో ఏడాదిలో నెరవేరని హామీ- మిగతావన్నీ చకచకా..
  on July 30, 2020 at 11:00 am

  ఏపీలో గతేడాది అసెంబ్లీ ఎన్నికల సమయంలో జగన్ తాము అధికారంలోకి రాగానే నవరత్నాల అమల్లో భాగంగా ఆసరా పింఛన్లను 2 వేల నుంచి మూడు వేల రూపాయలకు పెంచుకుంటూ పోతామని హామీ ఇచ్చారు. దీనిపై అప్పట్లో టీడీపీ అభ్యంతరాలు వ్యక్తం చేసినా వైసీపీ మాత్రం మూడు వేల రూపాయలు ఇస్తుందన్న భరోసాతో జనం ఓట్లేశారు. అధికారంలోకి రాగానే

 • జగన్ కూతురు చదివే చోటా అదే తీరు - ఏపీ సీఎం వల్లే కేంద్రం కొత్త విద్యా విధానం - ఎంపీ రఘురామ సంచలనం
  on July 30, 2020 at 10:57 am

  ''నాకు తెలిసి మన ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లండన్ లో చదువుకున్నట్లున్నారు. ఇప్పుడాయన కూతురు కూడా అక్కడే చదువుతోంది. లండన్ కు 200 కిలోమీటర్ల దూరంలో వేల్స్ అనే ప్రాంతముంది. గ్రేట్ బ్రిటన్ అధికారిక భాష ఇంగ్లీషే అయినప్పటికీ, వేల్స్ ప్రాంతంలో మాతృభాష అయిన 'వేల్ష్' అభివృద్ధి కోసం చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం 20

 • సోము రాకతో పవన్ కు కష్టాలేనా ? కీలక అంశాలపై తలోదారి- భవిష్యత్తులో జరిగేది ఇదే..
  on July 30, 2020 at 10:33 am

  కేంద్రంలో సుస్ధిర ప్రభుత్వాన్ని నడుపుతున్నా దక్షిణాదిలో మాత్రం ఓ దశ, దిశ లేకుండా పోతున్న బీజేపీని గాడిన పెట్టేందుకు అధిష్టానం తాజాగా పలు చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఇప్పటికే బాధ్యతారహితంగా వ్యాఖ్యలు చేస్తున్న పలువురు నేతలకు షోకాజ్ నోటీసులు జారీ చేయడం, టీవీ చర్చలకు దూరంగా ఉంచడం, సస్పెన్షన్లు చేయడం వంటి చర్యలు చేపట్టిన హైకమాండ్..

 • విషం కలిపిన చపాతీలు తిని జడ్జీ, అతని కుమారుడు మృతి: మహిళ, డ్రైవర్ అరెస్ట్
  on July 30, 2020 at 10:25 am

  భోపాల్: విషం కలిపిన చపాతీలు తిని ఓ జిల్లా జడ్జీ, అతని కుమారుడు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. ఇద్దరి మరణాలకు కారణమైన ఓ మహిళను పోలీసులు అరెస్ట్ చేసి కటకటాల వెనక్కినెట్టారు.

 • రాష్ట్రాలకు కేంద్రం షాక్: జీఎస్టీ పరిహారానికి బ్రేక్, భవిష్యత్‌లో ఇవ్వలేమని ఇండికేషన్స్..
  on July 30, 2020 at 10:16 am

  రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం షాక్ ఇవ్వబోతోంది. ఇకపై జీఎస్టీ పన్నుకు సంబంధించి భవిష్యత్‌లో పరిహారం చెల్లించలేమని మంగళవారం పార్లమెంటరీ ప్యానెల్‌కు తెలిపింది. రెవెన్యూ షేరింగ్ ఫార్ములా ఆధారంగా రాష్ట్రాలకు చెల్లించలేని పరిస్థితి అని.. కరోనా వైరస్ లాక్ డౌన్ వల్ల పన్ను వసూల్ మందగించడమే కారణం అని ఆర్థిక కార్యదర్శి అజయ్ భూషణ్ తెలిపారని హిందూ పత్రిక రిపోర్ట్ చేసింది.

 • మా ఆలోచనా అదే: ఏపీ నిర్ణయానికి వ్యతిరేకంగా..అందుకే ఆనందంగా: మోడీకి థ్యాంక్స్: పవన్ కల్యాణ్
  on July 30, 2020 at 9:48 am

  అమరావతి: దేశవ్యాప్తంగా విద్యా విధానంలో సమూల మార్పులకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుడుతూ కేంద్ర మంత్రివర్గం నూతన విద్యా విధానాన్ని అమల్లోకి తీసుకుని రావడాన్ని జనసేన పార్టీ స్వాగతించింది. అయిదో తరగతి వరకు మాతృభాషలోనే విద్యాబోధన కొనసాగించాలనే నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నామని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. మాతృభాషలో విద్యాబోధన కొనసాగించినప్పుడే గొప్ప ఫలితాలు

 • రామమందిరం నిర్మాణానికి ముహూర్తం సమీపిస్తోన్న వేళ..అయోధ్యలో కలకలం: అర్చకుడి సహా!
  on July 30, 2020 at 9:08 am

  అయోధ్య: కోట్లాదిమంది హిందువుల ఆరాధ్యదైవం శ్రీరామచంద్రుడు నడయాడిన పుణ్యప్రదేశం అయోధ్యలో కరోనా వైరస్ విలయ తాండవం చేస్తోంది. శ్రీరాముడి ఆలయ నిర్మాణానికి ముహూర్తం సమీపిస్తోన్న కొద్దీ అక్కడి పరిస్థితులు ప్రతికూలంగా మారుతున్నాయి. కరోనా మహమ్మారి ఎవరినీ వదలట్లేదు. తాజాగా అయోధ్య రామజన్మభూమి ఆలయ అర్చకుడొకరు కరోనా వైరస్ బారిన పడ్డారు. ఆయనతో పాటు రామజన్మభూమి ప్రదేశానికి గస్తీ

 • ఏపీలో మరో ఎమ్మెల్సీ ఉప ఎన్నిక- ఆగస్టు 24న పోలింగ్... వైసీపీ ఖాతాలోకే...
  on July 30, 2020 at 8:52 am

  ఏపీలో మరో ఎమ్మెల్సీ స్ధానానికి ఉప ఎన్నిక నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు ఖాళీగా ఉన్న రెండు స్ధానాల్లో ఒక దానికి మాత్రమే పరిగణనలోకి తీసుకుని కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. తాజా షెడ్యూల్ ప్రకారం ఉప ఎన్నిక నిర్వహణ కోసం ఆగస్టు 6న నోటిఫికేషన్ విడుదల కానుంది. ఆగస్టు 13 వరకూ

 • కరోనా వార్డులో నకిలీ డాక్టర్ కలకలం: 4రోజులపాటు విధులు, మహిళ, ఆమె భర్త అరెస్ట్
  on July 30, 2020 at 8:42 am

  విజయవాడ: ఆమె పేరు శైలజ. డాక్టర్ శైలజగా అందరినీ పరిచయం చేసుకుంది. అంతేగాక, పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్‌మెంట్(పీపీఈ) కిట్ ధరించి కరోనా బాధితులున్న వార్డులకు, ఐసీయూలకు వెళుతూ పర్యవేక్షించారు. దీంతో అందరూ ఆమెను వైద్యురాలిగా నమ్మేశారు. అయితే, నాలుగు రోజుల తర్వాత గానీ, ఆమె డాక్టర్ కాదనే విషయం తెలియలేదు. కొత్తగా 80 మంది వైద్యులు రావడంతో

 • సంచయిత మరో సంచలనం: అప్పుడేం చేశారు అశోక గజపతిరాజు, సింహాచల ఆలయానికి ‘ప్రసాద్‌’లో చోటు..
  on July 30, 2020 at 8:38 am

  సింహాచల దేవస్థాన చైర్మన్ సంచయిత గజపతిరాజు మరోసారి తన చిన్నాన్న అశోక గజపతిరాజు, మాజీ సీఎం చంద్రబాబు నాయుడుపై ఫైరయ్యారు. సింహాచల అప్పన్న ఆలయాన్ని కేంద్ర ప్రభుత్వం ‘ప్రసాద్' పథకంలో చేర్చిన విషయాన్ని వీడియో ట్వీట్ చేశారు. తనకు ఇప్పుడు సంతోషంగా ఉంది అని.. గత ప్రభుత్వ హయాంలో ఎందుకు చేయలేదు అని ఆమె ప్రశ్నించారు. తనపై

 • నాపై భయానక కుట్ర - జగన్ కు అపకీర్తి వద్దనే ముందుకొచ్చా - పేకాట వ్యవహారంపై వైసీపీ ఎమ్మెల్యే శ్రీదేవి
  on July 30, 2020 at 8:14 am

  ‘‘చాలా చోట్ల మానభంగాలు, హత్యలు, డైవర్స్ కేసుల రూపంలో మహిళలపై అకృత్యాలు జరుగుతున్నాయి. అవన్నీ వదిలేసి, శ్రీదేవి పేకాట ఆడిస్తోందనే వ్యవహారంపైనే ఎక్కువ శ్రద్ధ పెట్టారు. టీఆర్పీ రేటింగ్స్ పెంచుకునేలా ప్యాకేజీ కథనాలు రూపొందించారు. ప్రజల్ని ఆకట్టుకునే రీతిలో అద్భుతమైన హెడ్డింగ్స్ తో తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారు. జరిగిన దానితో నాకే మాత్రం సంబంధం లేదు.

 • ఛాన్స్ వస్తే ఆఫ్ఘన్‌లో పార్లమెంట్ భవనం.. నైజర్‌లో కన్వెన్షన్ సెంటర్: నేపాల్‌తోనూ కలిసి పని: మోడీ
  on July 30, 2020 at 8:09 am

  న్యూఢిల్లీ: మారిషస్‌లో కొత్తగా నిర్మించిన ఆ దేశ అత్యున్నత న్యాయస్థానం భవనాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కొద్దిసేపటి కిందట ప్రారంభించారు. మారిషస్ ప్రధానమంత్రి ప్రవీంద్ జగన్నాథ్‌తో కలిసి ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సుప్రీంకోర్టు భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి కీలకోపన్యాసం చేశారు. భారత్-మారిషస్ మధ్య ఉన్న దౌత్యసంబంధాల గురించి ప్రస్తావించారు. ఈ రెండు దేశాల

 • ఇండో-మయన్మార్ బార్డర్: అంబుష్ పేల్చడంతో ముగ్గురు జవాన్లు మృతి, ఐదుగురికి గాయాలు
  on July 30, 2020 at 7:42 am

  ఇంఫాల్: మణిపూర్ రాష్ట్రంలోని భారత్-మయన్మార్ దేశాలకు సరిహద్దుగా ఉన్న ఛందేల్ జిల్లాలో అనుమానిత పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ) మిలిటెంట్లు పేల్చిన అంబుష్ ఘటనలో ముగ్గురు అస్సామ్ రైఫిల్స్ జవాన్లు మరణించారు. మరో ఐదుగురు గాయాలపాలయ్యారు. బుధవారం రాత్రి ఈ ఘటన జరిగింది. ఇండో-మయన్మార్ సరిహద్దు ప్రాంతానికి మూడు కిలోమీటర్ల దూరంలోని ఖోంగ్టల్ వద్ద పహారా కాస్తున్న సమయంలో

 • కరోనా నుంచి కోలుకున్న విజయసాయిరెడ్డి- ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్...
  on July 30, 2020 at 7:17 am

  వారం రజుల క్రితం కరోనా కారణంగా ఆస్పత్రిలో చేరిన వైసీపీ ఎంపీ, కీలక నేత విజయసాయిరెడ్డి ప్రస్తుతం కోలుకుంటున్నారు. తాజాగా ఆయనకు నిర్వహించిన పరీక్షల్లో నెగెటివ్ రావడంతో ఆయన్ను హైదరాబాద్ అపోలో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసినట్లు తెలుస్తోంది. అయితే మరికొన్ని రోజుల పాటు ఆయనకు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన ఆస్పత్రి

 • గెట్ ఎ స్మైల్: కోవిడ్ రెస్పాన్స్ అంబులెన్సులు డొనేట్: భార్య, కుమార్తెతో కలిసి జెండా ఊపిన కేటీఆర్
  on July 30, 2020 at 6:55 am

  హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ కల్లోలాన్ని రేపుతోంది. రోజూ వెయ్యికి పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. కరోనాను కట్టడి చేయడానికి కేసీఆర్ సర్కార్ ఎన్ని ప్రయత్నాలు చేస్తోన్నప్పటికీ.. ఆశించిన ఫలితాలు రావట్లేదు. తెలంగాణలోని ఇతర జిల్లాలతో పోల్చుకుంటే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కరోనా కేసుల తీవ్రత అధికంగా ఉంటోంది. 24 గంటల్లో కొత్తగా తెలంగాణ

 • ఈ 3 ప్రశ్నలకు సమాధానం ఇవ్వు మోడీ: రాఫెల్ స్కాంపై మరోసారి రాహుల్, ఐఏఎఫ్‌కు కంగ్రాట్స్
  on July 30, 2020 at 6:52 am

  భారత వైమానిక దళం అమ్ముల పొదిలో రాఫెల్ యుద్ధ విమానాలు చేరిన నేపథ్యంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు. ఐఏఎఫ్‌కు ఆయన అభినందనలు తెలిపారు. దీంతోపాటు కేంద్ర ప్రభుత్వానికి ఆయన పలు ప్రశ్నలు సంధించారు. కాంగ్రెస్ హయాంలోనే రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు జరిగిన సంగతి తెలిసిందే. ఒక్కో రాఫెల్ యుద్ధ విమానం వ్యయం ఎందుకు

 • Coronavirus: కరోనాతో 65% ఆలస్యంగా వచ్చి 55% మృతి, బెంగళూరుకు జులై చీకటి రోజులు, పరిస్థితి !
  on July 30, 2020 at 6:46 am

  బెంగళూరు/ న్యూఢిల్లీ: ఐటీ, బీటీ సంస్థల దేశరాజధాని సిలికాన్ సిటీ బెంగళూరులో షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి. బెంగళూరు సిటీలో కరోనా వైరస్ (COVID 19) మహమ్మారి తాండవం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే కరోనా వైరస్ సోకిన 65 శాతం మంది ఆలస్యంగా ఆసుపత్రికి రావడంతో వచ్చిన 24 గంటల్లోనే 55 % మంది ప్రాణాలు

 • విశాఖ సెంట్రల్ జైల్లో కరోనా కల్లోలం- 27 మందికి ఖైదీలు, 10 మంది సిబ్బందికీ..
  on July 30, 2020 at 6:15 am

  విశాఖ కేంద్ర కారాగారంలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. కరోనా వైరస్ సోకడంతో ఇప్పటికే పలువురు ఖైదీలు ఆనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఇదే సమయంలో జైల్లో శిక్ష అనుభవిస్తున్న మొద్దు శ్రీను హంతకుడు ఓం ప్రకాశ్ చనిపోయాడు. కరోనా పరీక్ష నిర్వహిస్తే వైరస్ సోకినట్లు తేలింది. దీంతో అప్రమత్తమైన అధికారులు జైల్లో మిగిలిన ఖైదీలతో పాటు సిబ్బందికీ పరీక్షలు

 • అనంతలో వరదలు: వాగులో కొట్టుకుపోయిన కారు: అందులో ఇద్దరు: ఆర్టీసీ బస్సును ఫాలో
  on July 30, 2020 at 6:13 am

  గుత్తి: ఏడాది పొడవునా నీటి ఎద్దడిని ఎదుర్కొనే అనంతపురం జిల్లాలో ఈ ఏడాది కూడా కరవు తీరా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. గత ఏడాది తరహాలోనే ఈ సారి కూడా వరుణుడు అనంతపురం జిల్లాను కరుణించాడు. ఈ సారి వర్షాకాలం ఆరంభంలోనే అనంతపురం జిల్లాలో వరుసగా భారీ నుంచి అతి భారీ వర్షాలు

 • జగన్ కు భారీ ఎదురుదెబ్బ- సీమ ఎత్తిపోతల పథకానికి బ్రేక్- కేసీఆర్ అభ్యంతరాలతో ...
  on July 30, 2020 at 5:45 am

  ఏపీలో జగన్ సర్కారు చేపట్టిన మరో భారీ పథకానికి బ్రేక్ పడింది. తమకు భారీ మెజారిటీని కట్టబెట్టిన రాయలసీమ ప్రాంత అభివృద్ధి కోసం ప్రభుత్వం చేపట్టిన ఎత్తిపోతల పథకానికి తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరాలు చెబుతున్న నేపథ్యంలో కృష్ణాబోర్డు దానికి బ్రేక్ వేసింది. ఈ మేరకు ఏపీ జలవనరులశాఖ కార్యదర్శికి ఓ లేఖ రాసింది .దీంతో జగన్ సర్కారు

 • తెలంగాణలోనూ కరోనా కల్లోలం: 60 వేలకు చేరిన పాజిటివ్ కేసులు, 500 దాటిన మరణాలు
  on July 30, 2020 at 5:43 am

  తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి. మంగళవారం 1764 కేసులు రాగా.. బుధవారం ఆ సంఖ్య మరింత పెరిగింది. మంగళవారం రాత్రి 8 గంటల నుంచి బుధవారం రాత్రి 8 గంటల వరకు 18 వేల 263 మందికి పరీక్షలు చేశారు. 1811 మందికి కరోనా వైరస్ పాజిటివ్ వచ్చింది. దీంతో వైరస్ వచ్చిన మొత్తం

 • నో డెత్: ఆ దేశాన్ని వణికిస్తోన్న కొత్త వైరస్.. చైనా నుంచేనా..? మిస్టరీ ఏంటి..?
  on July 30, 2020 at 5:35 am

  వియాత్నం: కరోనావైరస్ ప్రపంచాన్ని కుదిపేస్తోంది. ఇప్పటికే పాజిటివ్ వైరస్ కేసులు రోజురోజుకూ పెరిగిపోతుండగా మృతుల సంఖ్య కూడా అదే క్రమంలో పెరుగుతున్నాయి. ఇక వియాత్నాం దేశంలో మాత్రం అదేదో అద్భుతం జరుగుతున్నట్లుగా అక్కడ ఇప్పటి వరకు ఒక్క మరణం కూడా కోవిడ్ ద్వారా సంభవించలేదు. అంతేకాదు స్థానికంగా వ్యాప్తి చెందుతోందని చెప్పేందుకు ఒక్క నిర్థారిత కేసు కూడా

 • MLA wife: 16 ఏళ్లు పిల్లలు లేరు, ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా వార్డు పక్కనే కాన్పు, తల్లి, బిడ్డ, సీఎం
  on July 30, 2020 at 5:28 am

  చెన్నై/ మదురై: ఆమె పేరు శివశంకరి, శివశంకరికి 16 ఏళ్లుగా పిల్లలు లేరు. ఆమె అధికార పార్టీ ఎమ్మెల్యే భార్య. దేవుడు కరుణించడంతో లేకలేక గర్బవతి అయిన శివశంకరికి ఓ కోరిక పుట్టింది. తాను ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేసుకుని అక్కడే బిడ్డకు జన్మనివ్వాలని ఆమె గర్బవతి అయిన సమయంలోనే డిసైడ్ అయ్యారు. ఎమ్మెల్యే భార్య అనుకుంటే

 • వణుకు పుట్టించేలా: 52 వేలకు పైగా: ఫస్ట్‌ టైమ్: ఆ హాట్‌స్పాట్‌లో తీవ్రత తగ్గుముఖం
  on July 30, 2020 at 5:18 am

  న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ ఉధృతి మరింత తీవ్రతరమైంది. కొద్దిరోజులుగా 50 వేలకు అటు ఇటుగా నమోదవుతోన్న పాజిటివ్ కేసుల సంఖ్య ఈ సారి దాన్ని అధిగమించింది. రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 24 గంటల వ్యవధిలో కొత్తగా 52,123 కేసులు వెలుగులోకి వచ్చాయి. ఒక్కరోజు వ్యవధిలో అరలక్షకు మించిన కరోనా కేసులు దేశంలో

 • తనను తాను మహ్మద్ ప్రవక్తగా: అమెరికా పౌరుడిపై పాక్ కోర్టులో బుల్లెట్ల వర్షం: దైవదూషణగా
  on July 30, 2020 at 4:46 am

  ఇస్లామాబాద్: పాకిస్తాన్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. తనను తాను మహ్మద్ ప్రవక్తగా ప్రకటించుకున్న ఓ వ్యక్తిపై దుండగులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఆయన అక్కడికక్కడే మరణించాడు. పాకిస్తాన్‌కు చెందిన వాడే అయినప్పటికీ.. ఆయనకు అమెరికా పౌరసత్వం ఉంది. ఈ ఘటన పట్ల అమెరికా స్పందించింది. దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. మృతుడి కుటుంబానికి సంతాపాన్ని తెలియజేసింది.

 • మరో రికార్డుకు జగన్ రెడీ- వారం రోజుల్లో 26778 ఉద్యోగాలు- ఆగస్టు 6 కల్లా విధుల్లోకి...
  on July 30, 2020 at 4:43 am

  ఏపీలో గతంలో గ్రామ సచివాలయాల్లో లక్షా 27 వేల ప్రభుత్వ ఉద్యోగాల కల్పనతో దేశంలోనే కనీవినీ ఎరుగని రికార్డు సృష్టించిన సీఎం జగన్ మరోసారి ఇలాంటి తరహా ఫీట్ కు సిద్దమవుతున్నారు. ప్రస్తుతం కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ ప్రైవేటు సంస్దలు ఉద్యోగాల కోతలు విధిస్తున్న వేళ ప్రభుత్వం మాత్రం భారీ స్ధాయిలో 26778 పోస్టులను భర్తీ

 • పెట్రోల్‌ బంక్‌లో ఒక్కసారిగా మంటలు.. బైకర్ సహా సిబ్బంది పరార్.. వెంటనే.. (వీడియో)
  on July 30, 2020 at 4:39 am

  అప్పడప్పుడు జరిగే ప్రమాదాలు హడలెత్తిస్తుంటాయి. ఇక మంటలు వేగంగా వ్యాపించే పెట్రోల్ బంక్‌లలో ప్రమాదం గురించి అయితే చెప్పక్కర్లేదు. ప్రాణాలను అరచేతిలో పెట్టుకోవాల్సిందే. అలాంటి ఘటన నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో జరిగింది. Lockdown: ఆఫ్ట్రాల్ బిర్యానీ తీసివ్వలేవా ? నువ్వు మొగుడేనా ? భార్య ఆత్మహత్య, భర్త బైక్ లోని పెట్రోల్

 • నేపాల్ దుస్సాహసం- భారత భూభాగంలోకి చొరబాట్లు- చైనా అండతో బరితెగింపు...
  on July 30, 2020 at 4:09 am

  గల్వాన్ లోయలో చైనాతో ఉద్రిక్తతల తర్వాత ఆ దేశం అండతో మనపై ఉరుముతున్న పొరుగుదేశం నేపాల్ ఇప్పుడు ఏకంగా బరి తెగించింది. కొత్తగా లేవదీసిన ఓ వాదనను అడ్డుపెట్టుకుని చొరబాట్లకు తెగిస్తోంది. దీనిపై భారత్ అభ్యంతరాలను కూడా లెక్క చేయడం లేదు. అడిగితే అవి తమ ప్రాంతాలే అనే వాదనను కూడా తెరపైకి తెస్తోంది. దీంతో పాకిస్తాన్,

 • రాఫెల్ ల్యాండింగ్ వేళ: వి మిస్ యూ: మనోహర్ పారికర్‌ను స్మరిస్తోన్న దేశం: సర్జికల్ స్ట్రైక్‌-1
  on July 30, 2020 at 3:37 am

  న్యూఢిల్లీ: మనోహర్ పారికర్.. ప్రస్తుతం దేశ ప్రజలు ఆయన పేరును స్మరించుకుంటున్నారు. భారత వైమానిక దళం అమ్ములపొదిలో బ్రహ్మాస్త్రంగా భావిస్తోన్న అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఙానంతో రూపుదిద్దుకున్న రాఫెల్ యుద్ధ విమానాలు ల్యాండ్ అయిన వేళ.. ఆయనను గుర్తు చేస్తున్నారు. వి మిస్ యు సర్ అంటూ నివాళి అర్పిస్తున్నారు. కారణం.. రాఫెల్ యుద్ధ విమానాలను భారత

 • ఏపీ సర్కార్.. వాట్ నెక్స్ట్: కేంద్రం ఝలక్: ఆ పథకానికి బ్రేక్ పడినట్టేనా?: జగన్ స్పందనేంటీ?
  on July 30, 2020 at 3:30 am

  అమరావతి: కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం వైఎస్ జగన్ ప్రభుత్వానికి ఝలక్ ఇచ్చినట్టే కనిపిస్తోంది. ఈ విద్యా సంవత్సరం నుంచే రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్‌లో విద్యాబోధనను కొనసాగించడానికి సమాయాత్తమౌతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్రం.. నూతన విద్యా విధానానికి శ్రీకారం చుట్టింది. దీని ద్వారా అయిదో తరగతి వరకు మాతృభాషలోనే విద్యాబోధనను కొనసాగించాల్సి ఉంటుంది.

 • కరోనావైరస్: 80 లక్షల మంది పీఎఫ్ డబ్బులు తీసేశారు.. మీపై దీని ప్రభావమేంటి
  on July 30, 2020 at 3:30 am

  భారత దేశంలో గత మూడు నెలల్లో 80 లక్షల మంది తమ భవిష్య నిధి(ప్రావిడెంట్ ఫండ్) హుండీని పగలగొట్టి తమ డబ్బులు వెనక్కు తీసుకున్నారు. హుండీ అని నేను ఊరికే అనడం లేదు. మట్టితో చేసిన హుండీ పగలగొట్టకుండా డబ్బులు ఎలా తీసుకోలేమో.. పీఎఫ్ నుంచి డబ్బులు వెనక్కు తీసుకోవడం కూడా అంత సులభం

 • సోనూసూద్ బర్త్ డే: ఉచిత వైద్య శిబిరాలతో వైద్యం, 50 వేల మందికి సేవలు, శభాష్ అంటూ నెటిజన్ల ప్రశంసలు..
  on July 30, 2020 at 3:26 am

  సోనూ సూద్.. లాక్‌డౌన్ ముందువరకు రిల్ లైఫ్‌లో విలన్ అని తెలుసు. కానీ కరోనా వల్ల విధించిన లాక్ డౌన్ వల్ల అతనిలోని రియల్ మనస్వత్వం ప్రపంచానికి తెలుసు. ఎక్కడ ఎవరికీ ఏ కష్టమొచ్చినా నేనున్నానంటూ ముందుకు కదిలాడు. 20 ఏళ్లలో తాను కష్టపడి సంపాదించిన డబ్బులను మంచినీళ్లప్రాయంలా ఖర్చుచేశాడు. ఇందుకు అతని సతీమణి సోనాలీ కూడా

 • మోడీకి థ్యాంక్స్ చెప్పిన చంద్రబాబు: ప్రధాని సారథ్యంలో: నూతన విద్యా విధానానికి జై
  on July 30, 2020 at 2:21 am

  అమరావతి: దేశవ్యాప్తంగా విద్యా విధానంలో సమూల మార్పులకు కేంద్రం శ్రీకారం చుట్టింది. ప్రాథమిక విద్యాభ్యాసం మొదలుకుని ఉన్నతస్థాయి విద్య వరకు కేంద్ర ప్రభుత్వం భారీ మార్పులను తీసుకొచ్చింది. విద్యాభ్యాసాన్ని మరింత సరళీకరించింది. విద్యా వ్యవస్థను పర్యవేక్షించే మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ పేరు మార్చడం, 10+2 విధానానికి స్వస్తి పలకడం, మూడేళ్లప్రాయంలోనే చిన్నారులను ప్రీస్కూల్ విద్యాను

 • కేంద్రం నుంచి గుడ్‌న్యూస్: ఆ అనుమతులు అవసరం లేదంటూ: క్లియరెన్స్‌కు తొలగిన అడ్డంకి
  on July 30, 2020 at 1:42 am

  నంద్యాల: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోన్న రాయలసీమ ఎత్తిపోతల పథకంలో మరో కీలక ముందడుగు పడటం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే ఈ ఎత్తిపోతల పథకం నిర్మాణానికి టెండర్ల ప్రక్రియను నిర్వహిస్తోన్న ఏపీ ప్రభుత్వానికి కేంద్రం తీపి కబురు అందించినట్టే. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ నిర్మాణ పనులను కొనసాగించడానికి బ్రేక్ వేస్తూ ఇచ్చిన స్టేను ఇదివరకే

 • రాజస్తాన్ రాజకీయ సంక్షోభంలో కీలక పరిణామం... గవర్నర్ నుంచి గెహ్లాట్‌కు గ్రీన్ సిగ్నల్...
  on July 29, 2020 at 7:05 pm

  రాజస్తాన్ రాజకీయ సంక్షోభంలో మొదటిసారి గవర్నర్ కల్‌రాజ్ మిశ్రా ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌ ప్రతిపాదన పట్ల సానుకూలంగా స్పందించారు. అగస్టు 14న అసెంబ్లీ సమావేశాలకు ఆయన అనుమతినిచ్చారు. ఇప్పటికీ మూడుసార్లు అశోక్ గెహ్లాట్ ప్రతిపాదనలను ఆయన తిరస్కరించారు. షార్ట్ నోటీసుతో అసెంబ్లీని సమావేశపరచడం కుదరదని,కనీసం 21 రోజుల వ్యవధితో కూడిన నోటీసులు అవసరమని గెహ్లాట్‌కు స్పష్టం చేశారు.

 • 'రాఫెల్' మొనగాళ్లు... ఆ 5 యుద్ద విమానాలను భారత్ చేర్చిన పైలట్లు వీళ్లే...
  on July 29, 2020 at 6:27 pm

  రాఫెల్.. రాఫెల్... గత 24గంటలుగా దేశంలో దీని గురించే ఎక్కువ చర్చ జరుగుతోంది. రాఫెల్ రాకతో భారత్ వైపు కన్నెత్తి చూడాలంటే శత్రు దేశాల వెన్నులో వణుకు పుట్టాల్సిందేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాఫెల్ యుద్ద విమానాలతో భారత వైమానిక దళంలో కొత్త శకానికి నాంది పలికినట్లయిందని.. ఈ మల్టీరోల్ విమానాలు ఐఏఎఫ్‌ సామర్థ్యాలను విప్లవాత్మకంగా మారుస్తాయని కేంద్ర

 • రాజ్‌భవన్‌లో కరోనా కలకలకం... 15 మంది సెక్యూరిటీ సిబ్బందికి పాజిటివ్...
  on July 29, 2020 at 5:05 pm

  ఆంధ్రప్రదేశ్‌ రాజ్‌భవన్‌లో 15 మంది సెక్యూరిటీ సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయింది. ఒక్కసారి ఇంతమందికి కరోనా సోకడంతో రాజ్‌భవన్‌లో కలకలం రేగింది. దీంతో ఆ 15మంది సహా మొత్తం 72 మంది సెక్యూరిటీ సిబ్బందిని ఉన్నతాధికారులు మార్చారు. ఇప్పటికే రాజ్‌భవన్‌లో పనిచేసే పలువురు సిబ్బంది కరోనా బారినపడ్డారు. కాగా,ఏపీలో బుధవారం(జూలై 29) ఒక్కరోజే రికార్డు స్థాయిలో

 • డసాల్ట్‌తో చాలామందికి తెలియని భారత్ ఫస్ట్ డీల్ ఇదే... రాఫెల్ కంటే ముందు అప్పట్లో...
  on July 29, 2020 at 4:40 pm

  రాఫెల్ యుద్ద విమానాల చేరికతో భారత వాయుసేన బలం అమాంతం పెరిగింది. భారత అమ్ముల పొదిలో చేరిన ఈ అత్యాధునిక యుద్ద విమానాలు శత్రు దేశాల గుండెల్లో గుబులు పుట్టిస్తాయనడంలో సందేహం అక్కర్లేదు. బుధవారం(జూలై 29) హర్యానాలోని అంబాలాలో ల్యాండ్ అయిన రాఫెల్ యుద్ద విమానాలను యావత్ దేశం ఆసక్తిగా తిలకించింది. ఫ్రాన్స్‌కి చెందిన డసాల్ట్ ఏవియేషన్‌తో

 • అమెరికాలో భారత నర్సు దారుణ హత్య: భర్త అరెస్ట్
  on July 29, 2020 at 4:09 pm

  న్యూయార్క్: అమెరికాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కేరళకు చెందిన ఓ నర్సుపై కత్తులతో దాడి చేసి హతమార్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఆమె భర్తను అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. కొట్టాయంకు చెందిన మెరీన్ జాయ్(26) తన భర్త(34)తో కలిసి ఫ్లోరిడాలో నివసిస్తోంది. అక్కడేవున్న ఆస్పత్రిలో మెరీన్ నర్సుగా సేవలందిస్తోంది. అయితే,

 • ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం... అక్కడ వారం రోజులు సంపూర్ణ లాక్ డౌన్...
  on July 29, 2020 at 3:28 pm

  కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఆగస్టు 3 నుంచి 9 వరకు సంపూర్ణ లాక్ డౌన్ విధిస్తున్నట్లు మంత్రి పేర్ని నాని వెల్లడించారు.టాస్క్‌ఫోర్స్ కమిటీ నివేదిక మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. లాక్ డౌన్ పీరియడ్‌లో ఉదయం 6గం. నుంచి రాత్రి 9గం. వరకు మాత్రమే నిత్యావసరాల

 • మహా ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ఇప్పటికీ ప్రయత్నిస్తోంది: శరద్ పవార్ సంచలనం
  on July 29, 2020 at 3:24 pm

  ముంబై: దేశంలోని పలు రాష్ట్రాల్లో అధికారంలో లేకపోవడాన్ని భారతీయ జనతా పార్టీ జీర్ణించుకోలేకపోతోందని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ అన్నారు. అంతేగాక, మహారాష్ట్రలో కొనసాగుతున్న శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ కూటమి ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఆ పార్టీ ఇంకా తన ప్రయత్నాలను కొనసాగిస్తోందని ఆరోపించారు. మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు తాము ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదని మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్

 • అన్‌లాక్ 3.0: రాత్రి కర్ఫ్యూ పూర్తిగా ఎత్తివేత, సినిమా హాళ్లకు నో, జిమ్స్‌కు ఓకే
  on July 29, 2020 at 2:52 pm

  న్యూఢిల్లీ: లాక్‌డౌన్ నిబంధనలను క్రమంగా సడలిస్తూ వస్తున్న కేంద్ర ప్రభుత్వం తాజాగా అన్‌లాక్ 3.0 మార్గదర్శకాలను విడుదల చేసింది. ఆగస్టు 1 నుంచి రాత్రి పూట కర్ఫ్యూను ఎత్తివేస్తున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది. దీంతోపాటు జిమ్‌లు, యోగా కేంద్రాలకు అనుమతిస్తున్నట్లు పేర్కొంది. ఏపీలో కరోనా కల్లోలం: ఒక్కరోజే 10వేలకుపైగా పాజిటివ్ కేసులు, 65 మంది మృతి, జిల్లాల వారీగా..

 • సిరిసిల్లలో వ్యభిచార కూపాలు... చదువు పేరుతో నరకం... ఆరేళ్ల తర్వాత విముక్తి...
  on July 29, 2020 at 2:31 pm

  సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని ఓ వ్యభిచార గృహం నుంచి ఓ మైనర్ బాలికకు విముక్తికి లభించింది. ఆరేళ్లుగా వ్యభిచార కూపంలో చిక్కుకుపోయి నరకం అనుభవించిన ఆ బాలికను పోలీసుల సహాయంతో బంధువులు బయటకు తీసుకొచ్చారు. పట్టణంలో వ్యభిచార గృహాల నిర్వహణ యథేచ్చగా సాగుతున్నా... ఇన్నాళ్లు పోలీసులు,అధికారులు పట్టించుకోకపోవడంపై విస్మయం వ్యక్తమవుతోంది. మంత్రి కేటీఆర్ సొంత ఇలాఖాలో వెలుగుచూసిన ఈ ఘటన రాష్ట్రంలో సంచలనం రేకెత్తిస్తోంది.

 • నేటి నుంచే అందుబాటులోకి హైదరాబాద్ హెటిరో ‘ఫావివిర్’ ఔషధం
  on July 29, 2020 at 2:15 pm

  న్యూఢిల్లీ: కరోనావైరస్ వ్యాధి చికిత్సలో వాడే ఫావిపిరావిర్ ఔషధాన్ని భారత్‌లో విక్రయించేందుకు హెటిరో ల్యాబ్స్ లిమిటెడ్‌కు అనుమతి లభించిన నేపథ్యంలో మార్కెట్లోకి విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది ఆ సంస్థ. రెమిడెసివిర్‌కు జనరిక్ రూపమైన ఫావిపిరావిర్‌ను కరోనావైరస్ వ్యాధి ప్రాథమిక, మధ్యస్థ దశలో ఉన్నప్పుడు వాడతారు. ఏపీలో కరోనా కల్లోలం: ఒక్కరోజే 10వేలకుపైగా పాజిటివ్ కేసులు, 65

 • సంచైతకు తొలి విజయం- కేంద్రం ప్రశంసలు...ప్రసాద్ పథకానికి ఎంపికైన సింహాచలం ఆలయం..
  on July 29, 2020 at 1:22 pm

  సంచలన రీతిలో విజయనగరం జిల్లాలోని మాన్సాస్ ట్రస్టుతో పాటు విశాఖలోని సింహాచలం ఆలయ ఛైర్మన్ బాధ్యతలు చేపట్టిన పూసపాటి వంశ వారసురాలు సంచైత గజపతిరాజు తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. ఎన్ని విమర్శలు ఎదురైనా లెక్క చేయకుండా సింహాచలం ఆలయ అభివృద్ధిపై దృష్టిసారించారు. ఇప్పుడు ఆమె చేస్తున్న కృషికి తొలి ఫలితం లభించింది. ఇన్నాళ్లూ తనను విమర్శించిన వారికి